విషాదం.. విద్యుత్ షాక్‌తో విద్యార్థిని మృతి

by Rajesh |
విషాదం.. విద్యుత్ షాక్‌తో విద్యార్థిని మృతి
X

దిశ, పరిగి : విద్యుత్ షాక్ తో తొమ్మిదేళ్ల విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మంచన్ పల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మంగలి దీక్షిత ( 9) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. సోమవారం ఎప్పటిలాగే పాఠశాలకు బయలుదేరింది. పాఠశాలలోని బాత్రూం వెళ్లి అక్కడ ఉన్న విద్యుత్ షాక్‌కు గురై అక్కడే కింద పడిపోయింది. ఇది గమనించిన విద్యార్థులు పాఠశాల యాజమానికి సమాచారం అందించారు.

పాఠశాల ఉపాధ్యాయులు వచ్చి చూసి వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే దీక్షిత మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీక్షిత విద్యుత్ షాక్ తో మరణించినట్లు ధృవీకరించారు. విషయం తెలుసుకున్న డీఈఓ రేణుక పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి దీక్షిత కుటుంబీకులను పరామర్శించారు. సంఘటనకు గల కారణాలను తెలుసుకున్నారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు.Next Story

Most Viewed