మంచిర్యాల జిల్లాలో విషాదం.. మనస్తాపంలో విద్యార్థిని ఆత్మహత్యాహత్నం

by Shiva Kumar |
మంచిర్యాల జిల్లాలో విషాదం.. మనస్తాపంలో విద్యార్థిని ఆత్మహత్యాహత్నం
X

దిశ‌, మంచిర్యాల: హాస్టల్ నుంచి త‌ల్లిదండ్రులు తనను ఇంటికి తీసుకువెళ్లడం లేద‌ంటూ భ‌వ‌నం పైనుంచి విద్యార్థిని దూకిన ఘ‌ట‌న మంచిర్యాల జిల్లా న‌స్పూరులో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. నస్పూర్ కస్తూర్భాలో ఏ.అక్షర అనే బాలిక ఆరో తరగతి చదువుతోంది. తాను హాస్టల్ ఉండనని.. ఇంటికి తీసుకెళ్లాలంటూ కొన్ని రోజుల నుంచి తల్లిదండ్రుల వెంట అక్షర పడుతోంది. దీంతో వారు అక్షరను హాస్టల్‌లోనే చదవాలంటూ తీవ్ర ఒత్తిడికి గురి చేసి అక్కడే ఉంచారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గరైన అక్షర ఉద‌యం హాస్టల్ బిల్డింగ్‌ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన హాస్టల్ సిబ్బందిని అక్షరను చికిత్స నిమిత్తం హుటాహుటిన మంచిర్యాల ఆసుప‌త్రికి త‌ర‌లించారు.Next Story

Most Viewed