కేసీఆర్కు పార్టీ ఫిరాయింపులే ప్రధానం.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్

by Dishafeatures2 |
TPCC Chief Revanth Reddy Slams CM KCR Over Food in Welfare Hostels
X

దిశ, తెలంగాణ బ్యూరో: వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా.. ప్రభుత్వం పట్టించుకోలేదని, కేసీఆర్ కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదు అని టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తుగా వరదలపై సీఎం కేసీఆర్ సమీక్షలు చేయకుండా ప్రగతి భవన్ ను చిల్లర రాజకీయాలకు వేదికగా మార్చారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో వరదల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఓ వైపు భారీ వ‌ర్షాల‌తో జ‌నం అత‌లాకుత‌లం అవుతుంటే ఒక‌రు ఫామ్ హౌస్ లో, మ‌రొక‌రు విందులు వినోదాల‌లో మునిగి తేలుతున్నారంటూ తీవ్ర స్థాయిలో రేవంత్ మండిప‌డ్డారు. శనివారం తన పార్లమెంట్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.“రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయింది... సీఎం,మునిసిపల్ మంత్రి వరదల్లో కొట్టుకుపోయారు.

తండ్రీ, కొడుకులకు ఇద్దరికీ తద్దినం పెట్టాలని ఆయన కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.తొమ్మిదేళ్లుగా ప్రతీ ఏటా వరదలు రావడం, ప్రభుత్వం మరిచిపోవడం పరిపాటిగా మారిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3 వేల కోట్ల నష్టం జరిగినట్లు తెలుస్తోందన్నారు.10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందనే అంచనాలు ఉన్నాయన్నారు.ఇసుక మేటలతో నిండిన వ్యవసాయ భూములకు రూ.20 వేలు అందించాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించాలన్నారు.వరదల్లో నష్టపోయిన వారికి తాత్కాలిక నష్ట పరిహారంగా రూ.15 వేలు ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

కేటీఆర్ కు బాత్రూంలు కడగడం తప్ప ఏమీ తెలియదని, ప్రజలు వరదలతో అల్లాడుతుంటే కేటీఆర్ బర్త్ డే పార్టీల్లో మునిగిపోయారన్నారు.ఇందుకు మున్సిపల్ శాఖ మంత్రిని ఉరేసినా తప్పు లేదు అని విమర్శించారు.పాలకుల కక్కుర్తి వల్లే కాలనీలు వరదల్లో మునిగిపోయాయని ఆరోపించారు.నిజాం కాలంనాటి చెరువులను 90 శాతం మంది బీఆరెస్ నేతలు ఆక్రమించుకున్నారన్నారు.రియల్ ఎస్టేట్ కోసమే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీఆరెస్ లో చేరారన్నారు.వరదలు, వర్షాలతో 30 మంది చనిపోయినా ఎందుకు పరామర్శించలేదని? కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రగతి భవన్ లో కుక్కకు ఉన్న విలువ ప్రజల ప్రాణాలకు లేదా? అని దుయ్యబట్టారు.

కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక వరద సాయం కింద తెలంగాణకు వెయ్యి కోట్లు తక్షణమే విడుదల చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వరద సాయం తీసుకురావాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిపై ఉన్నదననారు.ఇంత జరుగుతున్నా కిషన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇక్కడి పరిస్థితిని కిషన్ రెడ్డి ప్రధానికి వివరించి వెంటనే నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారుజ కాంగ్రెస్ ఎంపీలంతా కలిసి పార్లమెంటులో అమిత్ షా ను కలిసి వరద నష్టంపై నివేదిక ఇస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా వరద సహాయక చర్యల్లో పాల్గొనాలన్నారు. వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.ఇక ఉప్పల్ లో ఎలివేటెడ్ కారిడార్ పనులను రేవంత్ రెడ్డి పరిశీలించారు.సోమవారంలోగా ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో కదలిక రావాలి లేకుంటే పార్లమెంటులో నితిన్ గడ్కరీకి నివేదిస్తామని రేవంత్ రెడ్డి సూచించారు.



Next Story

Most Viewed