నేటి గూగుల్ డూడుల్ నౌరూజ్ 2023 : స్పెషాలిటీ ఏంటో తెలుసా?

by Disha Web Desk 4 |
నేటి గూగుల్ డూడుల్ నౌరూజ్ 2023 : స్పెషాలిటీ ఏంటో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: గూగుల్ డూడుల్ మార్చి 21న నౌరుజ్ 2023 సందర్భంగా ఆకర్షణీయమైన డూడుల్‌తో సెలబ్రేట్ చేసుకుంటోంది. కాగా నేడు పర్షియన్ నూతన సంవత్సర వేడుకల సందర్భాన్ని పురస్కరించుకుని రంగురంగుల ఇలస్ట్రేషన్, పూలతో కూడిన డూడుల్‌ను గూగుల్ ఉంచింది. అనేక ఇస్లామిక్ దేశాలలో మార్చి 21ని నౌరుజ్ 2023గా జరుపుకుంటారు. ఈ సంబరాన్ని సూచిస్తూ గూగుల్ తన డూడుల్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 300 మిలియన్ల మంది ఈ వేడుకలను నేడు జరుపుకుంటున్నారు. గూగుల్ డూడుల్ థీమ్ స్ప్రింగ్ ఫ్లవర్‌లు, తులిప్‌లు, హైసింత్‌లు, డాఫోడిల్స్, బీ ఆర్కిడ్స్‌ను తన డూడుల్‌కు డిజైన్‌కు జత చేసింది.

నౌరుజ్ అంటే ఏంటీ?

పెర్షియన్ నూతన సంవత్సరంగా నౌరుజ్‌ను సెలబ్రేట్ చేసుకుంటారు. గ్రెగోరియర్ క్యాలెండర్ ప్రకారం మార్చి 21న నౌరుజ్ వస్తుంది. ఇరాన్‌లో నౌరూజ్ మూలాలు కలిగి ఉండగా అనేక ఇస్లామిక్ దేశాలలో దీన్ని ప్రత్యేకంగా జరుపుకుంటారు. మధ్య ప్రాచ్యంలో ఎక్కవ భాగంలో దీనికి ప్రాచుర్యం ఉంది. వసంత రుతువు ప్రారంభం శీతాకాలం ముగింపు సందర్బంగా నౌరూజ్‌ను సెలబ్రేట్ చేసుకుంటారు. ఉత్తర అర్ధ గోళంలో వసంత కాలం ప్రారంభాన్ని నౌరూజ్ సూచిస్తుంది.

Next Story

Most Viewed