పంచె కట్టి.. తలపాగ చుట్టి..

by Disha Web Desk 11 |
పంచె కట్టి.. తలపాగ చుట్టి..
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పంచె కట్టు.. ఒకప్పుడు మన సంప్రదాయంలో ఒక భాగం.. ఇప్పటికీ పల్లెల్లో రైతులు పంచెలని ధరించడం.. ఒక రకంగా పంచెలు ధరించినవారు రైతులు, లేదా రైతుల ఆత్మీయులు అన్న భావన కలుగుతుంది. భావన ఎలా ఉన్నా రైతుల వేషాదరణ.. తెలుగుతనం ఉట్టిపడేలా.. పంచె కట్టు కట్టి.. తలపాగ చుట్టుకొని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి వారి వారి నియోజకవర్గాలలో నిర్వహించిన కార్యక్రమాలలో ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచారు. నిరంజన్ రెడ్డి గత కొంతకాలం నుంచి క్రమం తప్పకుండా పంచె కట్టుతో రావడంతో పాటు.. తలపాగ కూడా చుట్టుకుంటూ వ్యవసాయ మంత్రి అన్న పదానికి సార్థకత చేకూరేలా వ్యవహరిస్తున్నారు.

కానీ నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పూజలు, ఇతర ముఖ్య పండగలు మినహాయిస్తే ఎప్పుడు కూడా పంచె కట్టుతో కార్యక్రమాలకు హాజరైన దాఖలాలు లేవు. రైతు సంబరాలు కార్యక్రమంలో భాగంగా పంచె కట్టు కట్టుకొని.. భుజాన రుమాలు వేసుకొని కార్యక్రమాలకు హాజరు కావడంతో.. పార్టీ శ్రేణులతో పాటు కార్యక్రమానికి హాజరైన రైతులకు ఉత్సాహాన్ని కలిగించారు.. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాలలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తలపాక చుట్టుకుని.. ఎడ్ల బండిని తోలుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్న చోట్లకు వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించారు. మొత్తం పై మంత్రులు.. ఎమ్మెల్యేలు రైతు సాంప్రదాయం కనిపించేలా పంచ కట్టు.. అదిరేటట్టు కట్టి.. తలపాగా చుట్టి కార్యక్రమాలకు హాజరు కావడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది.

Next Story

Most Viewed