ప్రాణాపాయ స్థితిలో మూడేళ్ల బాలుడు.. స్పందించిన కేటీఆర్!

by Disha Web Desk 2 |
ప్రాణాపాయ స్థితిలో మూడేళ్ల బాలుడు.. స్పందించిన కేటీఆర్!
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా వేదికగా తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పట్ల మంత్రి కేటీఆర్ స్పందించడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. రాజకీయపరమైన సమస్యలతో పాటు చిన్నారుల ఆరోగ్య సమస్యలపై వచ్చిన ట్వీట్లకు స్పందించి.. వెంటనే పరిష్కార మార్గాలు చూపుతుంటారు. తాజాగా.. మరోసారి మంత్రి కేటీఆర్ పెద్ద మనసు చాటుకున్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న మూడేళ్ల చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. చిన్నారికి మంచి వైద్యం అందించాలని తన టీమ్‌ను ఆదేశించారు. కాగా, బాధిత బాలుడు ‘వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని రాయపర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న గుగులోత్ అశోక్ కుమారుడు.’ అశోక్ ట్వీట్‌కు మంత్రి రియాక్ట్ అయ్యారు.


Next Story

Most Viewed