బస్సులో సీటు దొరకాలంటే ఇదే ఏకైక మార్గం!

by Disha Web Desk 5 |
బస్సులో సీటు దొరకాలంటే ఇదే ఏకైక మార్గం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం అవస్థలు పడలేక బస్సు కిటీకీల నుండి పిల్లలను ఎక్కిస్తున్న ఘటన నిర్మల్‌‌లో జరిగింది. ఈ నేపధ్యంలోనే నిర్మల్ ఆర్టీసీ బస్టాండులో బుధవారం జనం కిక్కిరిసిపోయి బస్సు కోసం వేచి చూస్తున్నారు. చాలా సేపటి తర్వాత ఒక పల్లెవెలుగు బస్సు రావడంతో ఒక్కసారిగా ఎగబడ్డ జనం సీట్ల కోసం నానా తంటాలు పడ్డారు. కొందరు తోసుకుంటు వెళ్లి బస్సు ఎక్కగా.. మరికొందరు తమ లగేజీని కిటికీల ద్వారా సీట్లలో పెడుతుండగా, ఇంకొందరు పిల్లల్ని బస్సు కిటీకీల ద్వారా ఎక్కించి సీటు సంపాదించుకున్నారు.

దీనికి ప్రధాన కారణం సరిపడా బస్సులు లేకపోవడమేనని, ఆర్టీసీ ఉచిత ప్రయాణం వల్ల మహిళల ప్రయాణాలు పెరిగాయని, దీంతో సీట్లు దొరకక నానా అవస్థలు పడాల్సి వస్తుందని, ఆర్టీసీ బస్సులు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. అప్పటినుండి బస్సు ప్రయాణాలు గతంలో కంటే ఎక్కువ అయ్యాయి. బస్సులు సరిపడా లేకపోవడంతో సీట్ల కోసం ప్రయాణికులు కుస్తీలు పడాల్సి వస్తొంది.


Next Story

Most Viewed