Breaking:నీళ్ల కోసం నిండు ప్రాణాలను పణంగా పెట్టిన యువకుడు..కారణం ఇదే

by Disha Web Desk 3 |
Breaking:నీళ్ల కోసం నిండు ప్రాణాలను పణంగా పెట్టిన యువకుడు..కారణం ఇదే
X

దిశ డైనమిక్ బ్యూరో: తెలంగాణ లోని పెద్దపల్లి జిల్లా లోని ధర్మారం మండలం లంబాడీ తండా (బి) గ్రామంలో మిషన్ భగీరథ నీళ్ళు రావడం లేదని వాటర్ ట్యాంక్ ఎక్కి ఓ యువకుడు నిరసన తెలిపాడు. తమకి గత కొంతకాలంగా మిషన్ భగీరథ నీళ్ళు రావడం లేదని.. దీనితో త్రాగు నీరు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు వెంటనే స్పందించి తమ గ్రామానికి త్రాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నీళ్లురాని పక్షంలో తాను సూసైడ్ చేసుకుంటానని వాటర్ ట్యాంక్ ఎక్కి సెల్పీ వీడియో తీసుకుని పోస్ట్ చేశారు. నీళ్ల కోసం ఏకంగా నిండు ప్రాణాలను తీసుకోవడానికి ఆ యువకుడు సిద్ధమైయ్యారు. ఎవరైనా నీళ్ల కోసం ప్రాణాలను తీసుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోవడం సహజం. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో మంచి నీళ్ల విలువ మనిషికి ఇవ్వడంలేదు అంటారు. అంటే ఆ ప్రాంతాల్లో మంచినీళ్లు అంత చవకగా విరివిగా దొరుకుతాయని.

కానీ ఆది నుండి హంస పాదమే అన్నట్లు తెలంగాణ వాసులు మొదటి నుండి నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత సీఎం అయిన కేసీఆర్ తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న నీటి కొరత సమస్యను తీర్చడానికి మిషన్ భగీరథ ను తీసుకొచ్చారు. అప్పటి నుండి తమకు నీటి కొరత లేదని ప్రజల అభిప్రాయం. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొన్ని ప్రాంతాలకు మిషన్ భగీరథ నీళ్లు అందడం లేదు.

దీనితో నీళ్లకోసం మైళ్ళ దూరం నడవాల్సిన పరిస్థితి.. అలానే ఒకటో రెండో నల్లలుంటే ఒక్క బింది నీళ్ల కోసం గంటల కొద్దీ వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. దీనితో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed