ఆర్బీఐ డేటా ఆధారంగా కేసీఆర్ చేసిన అభివృద్ది ఇదే!.. కేటీఆర్ సెన్సేషనల్ ట్వీట్

by Disha Web Desk 5 |
ఆర్బీఐ డేటా ఆధారంగా కేసీఆర్ చేసిన అభివృద్ది ఇదే!.. కేటీఆర్ సెన్సేషనల్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ఆకట్టుకునే వృద్ధి సాధించింది అనే దానికి ఆర్బీఐ విడుదల చేసిన తాజా డాటానే ఆధారం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మన దేశంలోనే అతి చిన్న వయసున్న తెలంగాణ రాష్ట్రం, అనేక కీలక ప్రమాణాలలో ఇతర రాష్ట్రాలను అధిగమించిందని చెబుతూ.. ఆర్బీఐ విడుదల చేసిన డాటాను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి తెలంగాణా యొక్క నికర రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (NSDP) తలసరి ₹3.08 లక్షలకు చేరుకుంది. ఇది గణనీయ ఆర్థిక ఉత్పత్తిని ప్రదర్శిస్తున్న ప్రధాన రాష్ట్రాలలో అత్యధికంగా ఉండి దృడమైన ఆర్ధిక వ్యవస్థగా ఉందన్నారు. అలాగే తెలంగాణ ఆహార ధాన్యాల ఉత్పత్తి 2014-15 నుండి 2021-22 సంత్సరాల వరకు 11.6% CAGR వద్ద వృద్ధి చెందిందని, ఇది భారతదేశ సగటు 3.228 శాతాన్ని అధిగమించి వ్యవసాయంలో విజయం సాధించిందని తెలిపారు.

తెలంగాణ యొక్క నికర సాగునీటి ప్రాంతం 2014-15 నుండి 2020-21 సంవత్సరం వరకు 11.76 శాతం CAGR వద్ద వృద్ధి చెందిందని, ఇది భారతదేశ సగటు వృద్ధి అయిన 2.108 శాతం కంటే చాలా ఎక్కువగా ఉండి నీటిపారుదలలో వృద్ధి చెందిందని పేర్కొన్నారు. అంతేగాక జాతీయ సగటు 10.09 శాతంతో పోల్చితే, 2014-15 నుండి 2021-22 (7 దశలు) మధ్య రాష్ట్రాల అభివృద్ధి వ్యయం యొక్క అత్యధిక CAGR 15.9 శాతంగా ఉందని తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి తలసరి రాష్ట్రాల వారీగా సొంత పన్ను ఆదాయంలో తెలంగాణ రూ.30,914 వద్ద అగ్రస్థానంలో ఉందని, ఇందులో ఇతర ప్రధాన భారతీయ రాష్ట్రాలను అధిగమించి పన్ను వసూళ్లలో బలంగా ఉన్నామని అన్నారు.

అలాగే మహిళా సాధికారత పరంగా చూస్తే తెలంగాణలోని 40 శాతం MSME లు మహిళల యాజమాన్యంలో ఉన్నాయని, ఇది జాతీయ సగటు 20 శాతం కంటే రెట్టింపు అని, వైద్య, విద్య ప్రభావం పరంగా తెలంగాణ ప్రతి 4,460 మందికి ఒక MBBS సీటును అందిస్తుందని, ఇది జాతీయ సగటు 12,851కి ఒక సీటు కంటే చాలా ఎక్కువ అని వివరించారు. ఇక 2021-22లో తెలంగాణ తలసరి SGST సేకరణ రూ.7,665, ఇది భారతీయ సగటు రూ.4,461 కంటే చాలా ఎక్కువ అని వెల్లడిస్తూ.. ఈ డాటాకి మూలం RBI హ్యాండ్‌బుక్ అని తెలియజేశారు. అంతేగాక ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ నేను ఈ కోట్‌ను గుర్తు చేయాలనుకున్నాను అని, “ఒక రాజకీయ నాయకుడు తదుపరి ఎన్నికల గురించి ఆలోచిస్తాడు; ఒక రాజనీతిజ్ఞుడు తరువాతి తరం గురించి ఆలోచిస్తాడు అని కేటీఆర్ ఎక్స్ లో రాసుకొచ్చారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed