Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేషుడి ప్రత్యేకతలు ఇవే..

by sudharani |
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేషుడి ప్రత్యేకతలు ఇవే..
X

దిశ, వెబ్‌డెస్క్: గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనగానే అందరకీ మొదట గుర్తోచ్చేది హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేషుడు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్న ఖైరతాబాద్ వినాయకుడు ఈ ఏడాది శ్రీ దశమహా విద్యాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే ఈ ఏడాది ఖైరతాబాద్ గణేషుడి ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం..

ఖైరతాబాద్ వినాయకుడి ప్రత్యేకతలు..

* గతేడాది 50 అడుగుల ఎత్తులో వెలసిన ఖైరతాబాద్ గణేషుడు.. ఈ ఏడాది 63 అడుగులకు రూపుదిద్దుకుంది.

* శ్రీ దశమహా విద్యా గణపతి విగ్రహం నిలబడి ఉండగా.. తలపై ఏడు సర్పాలు ఉన్నాయి.

* వెనుక భాగంలో సంస్కృతంలో వ్రాసిన వచనం కనిపిస్తుంది.

* అలాగే గణేషుడికి 10 చేతులు ఉన్నాయి. కుడిచేతుల్లో కింది నుంచి పై వరకు ఆశీర్వాదం, దండ, ధాన్యం, త్రిశూలం, గధ ఉండగా.. ఎడమవైపు చేతిలో కింది నుంచి పై లడ్డు, పుస్తకం, తాడు, కత్తి, శంకం ఉన్నాయి.

* పాదాల దగ్గర పది అడుగుల ఎత్తున వరాహ దేవి, సరస్వతీ దేవి విగ్రహాలు ఉన్నాయి.

* ప్రధాన మండపానికి ఇరువైపులా దాదాపు 15 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీ వీరభద్ర స్వామి విగ్రహాలు ఏర్పాటు చేశారు.

ముఖ్యంగా పర్యావరణహితం కోసం మట్టి గణపతిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలుపుతున్నారు.



Next Story

Most Viewed