వీవీఎస్ లక్ష్మణ్‌‌పై బీజేపీ గురి? ఆ ఎంపీ టికెట్ ఇచ్చే ఆలోచనలో పార్టీ?

by Disha Web Desk 14 |
వీవీఎస్ లక్ష్మణ్‌‌పై బీజేపీ గురి? ఆ ఎంపీ టికెట్ ఇచ్చే ఆలోచనలో పార్టీ?
X

దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. మెజార్టీ గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలోనే కీలక వ్యక్తులను ఈ ఎన్నికల్లో బరిలో దించాలని బీజేపీ భావిస్తోంది. ఈ సందర్భంగా భారత మాజీ క్రికెటర్, హైదరాబాద్ వాసీ వీవీఎస్ లక్ష్మణ్‌‌పై గురిపెట్టినట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. వీవీఎస్ లక్ష్మణ్ బీజేపీ నుంచి ఎంపీగా బరిలో దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది. గతంలో సైతం వీవీఎస్ లక్ష్మణ్ బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది.

ఎన్నికల్లో మెజార్టీ విజయం సాధించాలని వీవీఎస్ లక్ష్మణ్‌ను బీజేపీ ఎంపీ టికెట్ ఇవ్వాలనే బీజేపీ నేతలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఎంపీ టికెట్ మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం ఇస్తే బాగుంటుందని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఈ టికెట్ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఫిక్స్ అయినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో బీజేపీ పాలిటిక్స్ రాష్ట్రంలో మరింత ఆసక్తి గా మారాయి. ఈ వ్యవహారంపై వీవీఎస్ లక్ష్మణ్ ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాలి.

తెలంగాణపై అధిష్టానం ఫుల్ ఫోకస్

కాగా, బీజేపీ అధిష్టానం సైతం తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ పెంచింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను పక్కక్కు నెట్టి ముందు వరుసలో ఉండాలని చూస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఖరారు అయింది. మార్చి నెల 4వ తేదీన ఆదిలాబాద్ జిల్లాకు ప్రధాని రానున్నారు. ఈ మేరకు తాజాగా షెడ్యూల్‌ విడుదల అయింది. మార్చి 4వ తేదీన ఉదయం 10: 20 కి ఆదిలాబాద్ హెలిప్యాడ్ కు చేరుకుంటారు. తర్వాత 10:30 నుంచి 11 గంటల వరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని ఆదిలాబాద్‌ పబ్లిక్ మీటింగ్ లో నిర్వహించనున్నారు.


Next Story

Most Viewed