ఇకపై ఫారిన్ భాషల్లోనూ దర్శనమివ్వనున్న TSCHE వెబ్ సైట్

by Dishafeatures2 |
ఇకపై ఫారిన్ భాషల్లోనూ దర్శనమివ్వనున్న TSCHE వెబ్ సైట్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TSCHE) వెబ్ సైట్ ఇక నుంచి ఫారిన్ భాషల్లోనూ దర్శనమివ్వనుంది. ఇప్పటికే ఇంగ్లీష్, తెలుగు, ఇతర ప్రాంతీయ భాషల్లో వెబ్ సైట్ విద్యార్థులకు అందుబాటులో ఉంది. జాతీయ, అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఇప్పటికే చాలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సంస్థ వైబ్ సైట్ ను 17 భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు జర్మన్, స్పానిష్, ఫ్రెంచ్, హెబ్ర్యూ, చైనీస్ వంటి అంతర్జాతీయ భాషల్లో కూడా TSCHE సైట్ కనిపించనుంది. రాష్ట్రంలో ఉన్నత విద్యకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి అంతర్జాతీయ విద్యార్థులకు తాజాగా తీసుకున్న నిర్ణయం ఎంతో ఉపకరించనుందని సంస్థ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు.



Next Story

Most Viewed