'వెంటనే మెస్ ఛార్జీలు పెంచండి'.. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్

by Disha Web Desk 13 |
వెంటనే మెస్ ఛార్జీలు పెంచండి.. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్స్ విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. ఈ మేరకు సోమవారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వెల్ఫేర్‌తోపాటు మోడల్‌ సూళ్లు, కస్తూర్బా విద్యాలయాలు, సాధారణ గురుకులాల సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మెస్, కాస్మొటిక్ ఛార్జీలు 25 శాతం పెంచుతు మార్చి మొదటి వారంలో రాష్ట్ర మంత్రి ఉప సంఘం తీసుకున్నా నిర్ణయం కేవలం ప్రకటనలకే పరిమితం అయిందని విమర్శించారు. రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న పెంపు నిర్ణయం అమలు కాకపోవడం సిగ్గు చేటన్నారు.

మరో రెండు రోజుల్లో ఉన్నత విద్యార్థుల సంక్షేమ హాస్టల్స్, మరో 12 రోజులకు పాఠశాల విద్యార్థుల సంక్షేమ హాస్టల్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సంక్షేమ హాస్టల్స్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్ని హాస్టల్స్ కలిపి 3214 ఉన్నాయని, అందులో 8 లక్షల 50 వేల విద్యార్థులు ఉంటున్నారని తెలిపారు. సంక్షేమ హాస్టల్స్ సమస్యలకు నిలయంగా మారాయన్నారు. కొన్ని హాస్టల్స్‌కి పక్క భవనాలు లేవని శిథిలావస్థకు చేరుకున్న హాస్టల్స్ ఉన్నాయని సరిపడా మౌలిక వసతులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచాలనీ లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులను ఏకం చేసి మెస్ ఛార్జీలు పెంచే వరకు పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.



Next Story

Most Viewed