ఎవరూ నోరు తెరవొద్దు.. పేపర్ లీక్ కేసు దర్యాప్తును గోప్యంగా ఉంచాలనే వ్యూహం

by Dishanational2 |
ఎవరూ నోరు తెరవొద్దు.. పేపర్ లీక్ కేసు దర్యాప్తును గోప్యంగా ఉంచాలనే వ్యూహం
X

దిశ,తెలంగాణబ్యూరో : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు ఇన్వెస్టిగేషన్ వివరాలపై ఎవరూ ఏం మాట్లాడొద్దని ప్రగతిభవన్ నుంచి ఆదేశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. విచారణ అంశాలు బయటికి వెళ్తే సీరియస్ యాక్షన్ ఉంటుదని హెచ్చిరించినట్టు సమాచారం. తమ అనుమతి లేకుండా ఎంక్వైరీ రిపోర్టును ఎవరికి ఇవ్వొద్దని పేర్కొనట్టు తెలుస్తున్నది. సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ అంశంలో ఈడీ ఎంటరై విచారణకు రెడీ అయింది. కానీ సిట్ ఈడీకి సాయం చేయకపోవడంతో ఈడీ హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ప్రగతిభవన్ నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు సిట్ అధికారులు సహకరించడం లేదనేది టాక్.

హోంశాఖలో గట్టి నిఘా

సిట్ విచారణ విషయాలు సెక్రటేరియట్ లోని హోంశాఖ నుంచి బయటికి వెళ్తున్నాయనే అనుమానంలో ప్రభుత్వం ఉంది. దీంతో ఆ శాఖలోని కొందరు అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఎవరెవరు ఏం చేస్తున్నారో నిఘా పెట్టడంతో పాటు, ఎంక్వైరీ వివరాలను అక్కడికి పంపొద్దని ఆదేశించినట్టు ప్రచారం జరుగుతున్నది. సిట్ తన డెయిలీ ఎంక్వైరీ రిపోర్టును ఇతర అధికారులకు పంపకుండా నేరుగా ప్రగతిభవన్ కు పంపిస్తున్నట్టు సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ ఉంది. అయితే సిట్ పోలీసులు సహకరించట్లేదని ఈడీ హైకోర్టును ఆశ్రయించగా కేసు విచారణలో ఉంది. ఈ కేసులో హైకోర్టు తీర్పు చూసిన తర్వాత తుదినిర్ణయం తీసుకుందామని, అప్పటివరకు ఏం మాట్లాడొద్దని ఆదేశించినట్టు తెలుస్తున్నది.

Next Story

Most Viewed