పోలీసు శాఖలో తాజా బదిలీలపై కొనసాగుతున్న సస్పెన్స్.. MP ఎన్నికల వరకేనా?

by Disha Web Desk 4 |
పోలీసు శాఖలో తాజా బదిలీలపై కొనసాగుతున్న సస్పెన్స్.. MP ఎన్నికల వరకేనా?
X

దిశ, రాచకొండ : సోమవారం రాష్ట్ర పోలీసు శాఖలో అన్యూహంగా భారీ బదిలీలు జరిగాయి. దీంతో ఈ బదిలీలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. మొత్తం ప్రభుత్వం 136 మందిని బదిలీ చేసింది. ఇందులో 12 మంది ఐపీఎస్ లు, 39 మంది నాన్ క్యాడర్ అదనపు ఎస్పీలు, 5 మంది నాన్ క్యాడర్ ఎస్పీలు, 110 మంది డిఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేస్తూ పోస్టింగ్‌లను ఇచ్చింది. ముఖ్యంగా పోలీసు కమిషనర్ సారధ్యంలో ఉండే టాస్క్ ఫోర్స్, ఎస్ఓటీ సారధులు మారారు. ఈ బదిలీలు లోకసభ ఎన్నికల నేపథ్యంలో జరిగాయి. అయితే ఈ పోస్టింగ్‌లు ఎన్నికల వరకే నా లేదా పోలీసు మాన్యువల్ ప్రకారం కనీసం రెండు యేండ్లు కొనసాగుతాయా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

Read Disha E-paper

Next Story