ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు ఫైనలైజ్.. నేడు అనౌన్స్ చేసే చాన్స్!

by Rajesh |
ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు ఫైనలైజ్.. నేడు అనౌన్స్ చేసే చాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్, బీజేపీలు 17 స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను అనౌన్స్ చేశాయి. కాంగ్రెస్ 14 స్థానాలకు తమ అభ్యర్థులను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక, తెలంగాణలో పెండింగ్ మూడు స్థానాలపై కాంగ్రెస్ కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. నేడు సాయంత్రం మూడు స్థానాల అభ్యర్తులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థులు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఖమ్మం నుంచి పొంగులేటి ప్రసాద్ రెడ్డి, కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్, హైదరాబాద్ నుంచి సమీరుల్లా ఖాను పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

పెండింగ్ స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసే చాన్స్ ఉంది. ఇదే విషయమై ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు. అయితే ఖమ్మం మాత్రం కాంగ్రెస్ పార్టీలో హాట్ సీటుగా మారింది. ఈ సెగ్మెంట్‌లో ఇప్పటికే పలువురి పేర్లు పరిశీలించగా.. మండవ, మల్లు నందిని పేర్లను అధిష్టానం పరిశీలించింది. అయితే ఎల్లుండి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి పెండింగ్ స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించే చాన్స్ ఉంది.

Next Story

Most Viewed