ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ వ్యక్తులు.. టీఎస్ యూటీఎఫ్ నేతల డిమాండ్

by Dishafeatures2 |
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ వ్యక్తులు.. టీఎస్ యూటీఎఫ్ నేతల డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ వ్యక్తుల చొరబాటు ఆందోళనకరమని టీఎస్ యూటీఎఫ్ నేతలు విమర్శలు చేశారు. సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రాథమిక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, చావ రవి మాట్లాడుతూ.. ఉభయ రాష్ట్రాల్లో శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీల అండతో కార్పొరేట్ వ్యక్తులు ఎన్నిక కావడం ప్రభుత్వ విద్యారంగానికి ప్రమాదకరమని వారు ఆందోళన వ్యక్తంచేశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేరుగా జోక్యం చేసుకుని అధికార దుర్వినియోగంతో పాటు, ప్రలోభాలకు గురిచేయటాన్ని వారు ఖండించారు. సీపీఎస్, ఇన్ కం ట్యాక్స్ భారాన్ని ఉద్యోగులపై మోపి, జాతీయ విద్యావిధానం పేరిట ప్రభుత్వ విద్యారంగాన్ని ధ్వంసం చేయాలనుకున్న బీజేపీ ఉపాధ్యాయ ఎన్నికల్లో నేరుగా తన అభ్యర్థిని నిలబెడితే ఓడించాల్సిన ఉపాధ్యాయులు ఆ ప్రమాదాన్ని గుర్తించలేకపోవడం విచారకరమన్నారు. ఇదిలా ఉండగా టీఎస్ పీఎస్సీ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలని వారు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed