హైదరాబాద్‌లోను ‘ది కేరళ స్టోరీ’ వివాదం.. థియేటర్ వద్ద పోలీస్‌ల ఓవర్ యాక్షన్ (వీడియో)

by Disha Web Desk 12 |
హైదరాబాద్‌లోను ‘ది కేరళ స్టోరీ’ వివాదం.. థియేటర్ వద్ద పోలీస్‌ల ఓవర్ యాక్షన్ (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేరళ గత కొద్ది సంవత్సరాలుగా 32 వేల మంది యువతులు, మహిళలు మాయమై టెర్రరిజం వైపు వెళ్తున్న సంఘటనలపై ‘ది కేరళ స్టోరీ’ అనే టైటిల్ తో సినిమా వచ్చింది. ఈ సినిమా కల్పిత కథ కాదని ట్రూ స్టోరీ అంటూ డైరెక్టర్ సుదీప్తోసేన్‌ సినిమాను తెరకెక్కించారు. దీంతో ఈ సినిమా మొదటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. దేశవ్యాప్తంగా ఈ సినిమాను కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ చేశారు. ఈ సెగ ఇప్పుడు తెలంగాణకు కూడా పాకింది. హైదరాబాద్‌లోను ఈ సినిమాను కొన్ని తీయేటర్లరలోనే విడుదల చేశారు. మంగళవారం కాచిగూడ వెంకటరమణ థియేటర్ వద్ద అభిమానులు, హిందూ సంఘాలు కండువాలు వేసుకుని సినిమాకు వచ్చారు.

అయితే హల్ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారికి పోలీసులకు మధ్య మాటల యుద్దంతో థియేటర్ వద్ద ఆందోళన వాతావరణం ఏర్పడింది. కండువాలు ఉంటే సినిమాకు అనుమతి ఉండదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో కండువాలతో వచ్చిన వారు అక్కడే నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా కండువా ధరించిన వారు మాట్లాడుతూ.. తిలకం, కండువా వేసుకున్నందుకు హిందువులను కేరళ స్టోరీ సినిమా చూడటానికి అనుమతించడం లేదని వారు వాపోయారు. మనం పాకిస్థాన్‌లో ఉన్నామా.. లేదా ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నామా అంటూ పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed