బండికి కేసీఆర్ సర్కార్ షాక్.. పాదయాత్రపై High Court లో పిటిషన్

by Disha Web Desk 19 |
బండికి కేసీఆర్ సర్కార్ షాక్.. పాదయాత్రపై High Court లో పిటిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: టీ- బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, శాంతి భద్రతల కారణంగా పాదయాత్ర ఆపాలని పోలీసులు బండి సంజయ్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను బీజేపీ హైకోర్టులో సవాల్ చేయగా.. హైకోర్టు సింగిల్ జడ్జీ పోలీసులు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేశారు. దీంతో బండి పాదయాత్రకు మార్గం సుగమమైంది. కాగా, హైకోర్టు సింగిల్ జడ్జీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని ప్రభుత్వం సీజే ధర్మాసనాన్ని కోరింది. పాదయాత్ర కొనసాగితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను మధ్యాహ్నం 1.15 నిమిషాలకు విచారించేందుకు సీజే జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం అంగీకరించింది.

Next Story

Most Viewed