జాక్ పాట్ కొట్టిన జితేందర్ రెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నిమిషాల్లోనే కీలక పోస్ట్

by Disha Web Desk 19 |
జాక్ పాట్ కొట్టిన జితేందర్ రెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నిమిషాల్లోనే కీలక పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి జాక్ పాట్ కొట్టారు. బీజేపీకి రాజీనామా చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరిన గంటల్లోనే ఆయనను కీలక పోస్ట్ వరించింది. జితేందర్ రెడ్డిని న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా (క్రీడా వ్యవహారాలు) కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు జితేందర్ రెడ్డి నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇవాళ జారీ చేశారు. న్యూఢిల్లీ తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి ఇటీవలే మల్లు రవి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మల్లు రవి రిజైన్‌తో ఖాళీగా ఉన్న ఈ పోస్ట్‌ను.. పార్టీలో చేరిన వెంటనే జితేందర్ రెడ్డిని వరించింది. దీంతో పాటు క్యాబినేట్ ర్యాంక్‌తో తెలంగాణ ప్రభుత్వ క్రీడా వ్యవహరాల సలహాదారుడిగా నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం.

కాగా, పార్లమెంట్ ఎన్నికల వేళ టీ-బీజేపీకి జితేందర్ రెడ్డి బిగ్ షాకిచ్చారు. బీజేపీ హై కమాండ్ తీరుపై తీవ్ర అసంతప్తితో ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీకి గుడ్ బై చెప్పిన జితేందర్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జితేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణలో వరస చేరికలతో ఫుల్ జోష్‌లో ఉన్న బీజేపీకి.. జితేందర్ రెడ్డి రివర్స్ షాక్ ఇచ్చారు. జితేందర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ టికెట్ ఆశించారు. కానీ బీజేపీ హైకమాండ్ మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీమంత్రి డీకే అరుణకు కేటాయించింది. దీంతో జితేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి గురి అయ్యారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వనించారు. దీంతో జితేందర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

Next Story

Most Viewed