ప్రైవేట్ ఆస్పత్రిలో కీచక డాక్టర్.. తప్పును కప్పిపుచ్చేందుకు బేరం!

by GSrikanth |
ప్రైవేట్ ఆస్పత్రిలో కీచక డాక్టర్.. తప్పును కప్పిపుచ్చేందుకు బేరం!
X

దిశ, నల్గొండ బ్యూరో: కుటుంబ పోషణకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసే మహిళల పట్ల కొంతమంది కీచక మగాళ్ల ప్రవర్తన అత్యంత దారుణంగా ఉంది. ఇప్పటికే చాలా సందర్భాల్లో అలాంటి సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. సరిగ్గా అలాంటి ఘటనే తాజాగా నల్లగొండలో వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో కీచక డాక్టర్ అక్కడే రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న యువతికి మాయమాటలు చెప్పి లోబర్చుకున్నట్లు తెలిసింది. దాని ఫలితంగా ఆమె గర్భం దాల్చినట్లు సమాచారం. అయితే గర్భం రావడానికి కారణం నువ్వే అంటూ, పెళ్లి చేసుకోవాలని ఆ డాక్టర్‌పై యువతి ఒత్తిడి చేయడం ప్రారంభించడంతో సదరు డాక్టర్ నిరాకరించినట్లు సమాచారం. దీంతో ఈనెల 12న యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి సిద్ధమైంది.

ఈ క్రమంలో అప్రమత్తమైన డాక్టరు ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో బయటికి తెలియకుండా ఉండాలని దానికోసం రూ.50 లక్షల ఆఫర్ చేసినట్లు వినికిడి. కానీ, ఆ యువతి కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ భేరసారాలు నడిపించడం విషయము బయటకు రాకుండా చూసేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ ప్రజా ప్రతినిధి రంగంలోకి దిగినట్లు తెలిసింది. సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న వైద్యులు ఇలాంటి నీచమైన పనులకు వడగట్టడం.. చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా డబ్బులు ఇచ్చి తప్పును సరి చేసుకోవాలని చూడడం వారి వక్రబుద్ధికి నిదర్శనం.Next Story

Most Viewed