ఇళ్ల నుంచి భయటకు రావాలంటే జంకుతున్న ప్రజలు!

by Disha Web Desk 2 |
ఇళ్ల నుంచి భయటకు రావాలంటే జంకుతున్న ప్రజలు!
X

దిశ, మానవపాడు/ఉండవల్లి: భానుడి ప్రతాపంతో రోజురోజుకు ఎండ తీవ్రత పెరిగి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.దీంతో జనాలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జిల్లాలో అలంపూర్‌లో గత 5 రోజులు 40 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదైంది. అయితే సోమవారం 43.1 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదైందని అధికార లెక్కలు చెప్పుతున్నాయి. ఎండ తీవ్రత తాళ్లలేక జనాలు బయటకు రావాలంటే భయంతో జంకుతున్నారు.పనుల నిమిత్తం ఉదయం, సాయంత్రం వేళ్లలో మాత్రమే బయటకు వస్తున్నారు. దీంతో మధ్యాన్నా సమయంలో రోడ్లని నిర్మానుష్యంగా మారి భీతిని తలపిస్తున్నాయి. మిర్చి పనులకు వెళ్లే కూలీలు ఎండను సైతం లెక్కచేయకుండా వెళ్తున్నారు. అలా వెళ్లి వడదెబ్బ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటలను మనం చూస్తున్నాం. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో ప్రజలకు అధికారులు తగు సూచనలు చేయాల్సిన బాధ్యత ఎంతైనా అవసరం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.గత ఏడాది వడదెబ్బ ప్రభావంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ బారిన పడకుండా ఉంటాం

వడదెబ్బ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి: మానోపాడు వైద్యురాలు రిజ్వాన

పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 11 గంటల మధ్యాహ్నం 3 వరకు బయటకు వెళ్ళొదు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకు రాకండని ఆమే తెలియజేశారు. శరీరం డీహైడ్రేషన్ కాకుండా నీరుబాగా తాగాలి. రోజు తినే ఆహారంలో ఎక్కువ ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. చల్లగా ఉండే రంగు పానీయాలు తాగడం మంచిది కాదు. వేసవిలో చాలామందికి ఆకలి తక్కువగా ఉండడం కలుగుతుంది. కావున సరైన డైట్ పాటించి నీరు మజ్జిగ కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. వేసవి ఉపశమనం కోసం మాంసాహారం తగ్గించి కూరగాయలను ఆహారంగా ఎక్కువగా తీసుకోవాలి. పుచ్చకాయలు, కీర, తాటి ముంజలు, బీరపొట్టు వంటి వాటిలో నీటి శాతం పుష్కలంగా ఉంటుందని, వీటి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయని తెలిపారు.



Next Story

Most Viewed