తెలంగాణలో గ్రూపు-1, 2, 3 పరీక్షల షెడ్యూల్ విడుదల

by GSrikanth |
తెలంగాణలో గ్రూపు-1, 2, 3 పరీక్షల షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్స్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్‌సీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. జూన్ 9న గ్రూపు-1 ప్రిలిమ్స్, అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆగష్టు 7, 8వ తేదీల్లో గ్రూపు-2, నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూపు-3 పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నియామకాలపై దృష్టి పెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే మొత్తం టీఎస్‌పీఎస్‌సీ బోర్డునే ప్రక్షాళన చేసింది. చైర్మన్‌తో పాటు సభ్యులందరినీ మార్చేసింది. ప్రస్తుతం చైర్మన్‌గా తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు.Next Story

Most Viewed