కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ఆ అంశంపై సీఎం క్లారిటీ ఇస్తారా?

by Disha Web Desk 2 |
కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ఆ అంశంపై సీఎం క్లారిటీ ఇస్తారా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ సమావేశాలు నేటి(గురువారం)నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ప్రారంభం కాగానే మృతి చెందిన కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న మృతికి సంతాప తీర్మానంను ప్రవేశపెట్టనున్నారు. ఈ తీర్మానంపై సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. అయితే సాయన్నకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదని అనుచరులు స్మశానవాటికలో నిరసన తెలిపిన విషయం విధితమే. దళితలపై సీఎం వివక్షచూపుతున్నారనే ఆరోపణలున్నాయి. అయితే ఈ తీర్మానంలో కేసీఆర్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేయనున్నారు. సాయంత్రం జరిగే బీఏసీ సమావేశంలో సభను ఎన్నిరోజులు నిర్వహించాలనేదానిపై నిర్ణయం తీసుకొని అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఈ సమావేశాల్లో క్వశ్చన్ అవర్ ఉంటుందా? ఉండదా? జీరో అవర్ ఉంటుందా? ఉండదా? అనేదానిపై సందిగ్ధం నెలకొంది. మూడురోజులే సభను నిర్వహించాలనుకుంటున్న ప్రభుత్వం వీటికి అవకాశం ఇస్తుందా? ఇవ్వదా అనేది చూడాలి. మిగిలిన రోజులు సభలో వ్యవసాయం సంక్షేమంపైనే షార్ట్ డిస్కషన్ ను ప్రభుత్వం చేయనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. అసెంబ్లీ సమావేశాలు మూడ్రోజులే కొనసాగనున్నట్లు సమాచారం. మొదటి కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందడంతో ఆయన సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. మిగిలిన రెండ్రోజులు సంక్షేమం, వ్యవసాయంపై షార్ట్ డిస్కషన్ చేయనున్నట్లు సమాచారం. ఈసారి క్వశ్చన్ అవర్ నిర్వహించాలా? జీరో అవర్‌ను తీసివేసి చర్చిస్తారా? అనేది హాట్ టాఫిక్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చివరి సమావేశాలు కావడంతో చేపట్టిన పథకాలను విస్తృతంగా ప్రచారం చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ సమావేశాల మొదటి రోజునే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీన బిల్లుతో పాటు గవర్నర్ వెనక్కి పంపిన మరో మూడు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే అసెంబ్లీ సమావేశాలను ఎన్నిరోజులు నిర్వహిస్తారనేది గురువారం జరిగే బీఏసీ సమావేశంలో చర్చి తుదినిర్ణయం తీసుకోనున్నారు.

సభలో నాలుగు బిల్లులు

అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం నాలుగు బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పురపాలక చట్ట సవరణ బిల్లు, ప్రైవేట్ వర్సిటీల బిల్లు, ‘వైద్యవిద్య సవరణ’ బిల్లులను గవర్నర్ ప్రభుత్వానికి తిరిగి పంపించిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లులను సవరించి అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదంతో మళ్లీ గవర్నర్‌కు పంపనున్నారు. మరొకొత్త బిల్లు ఆర్టీసీ ఉద్యోగుల బిల్లు(ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం బిల్లు)ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లులన్నింటినీ ప్రభుత్వం ఈరోజే ప్రవేశపెట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆర్టీసీ ఉద్యోగుల బిల్లుపై సుధీర్ఘంగా చర్చించే అవకాశం ఉన్నది.

నేడు మండలిలో..

రాష్ట్రంలో కురిసిన భారీ వరదలపై గురువారం శాసన మండలిలో చర్చించనున్నారు. సభకు హాజరైన సభ్యులందరికీ వరదలపై మాట్లాడే అవకాశం కల్పించే అవకాశం ఉందని సమాచారం. సభ్యులందరూ మాట్లాడిన తర్వాత ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు వివరణ ఇస్తారని సమాచారం. అయితే మండలి ఎన్నిరోజులు నిర్వహించాలనేది బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు. అందుకు అనుగుణంగా మండలిలో వ్యవసాయం, సంక్షేమంపై షార్ట్ డిస్కషన్ చేయనున్నట్లు తెలిసింది.


Next Story

Most Viewed