HYD: అలా చేస్తే పేదరికం పోతోంది.. టెక్నాలజీ వినియోగంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
HYD: అలా చేస్తే పేదరికం పోతోంది.. టెక్నాలజీ వినియోగంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: టెక్నాలజీ, పాలసీలను సమర్థవంతంగా అమలు చేస్తే పేదరికం లేదని సమాజం సాధ్యమవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్‌లో ‘డీప్ టెక్నాలజీస్’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. 2047 నాటికి నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశంగా భారత్ మారుతుందని చంద్రబాబు చెప్పారు. పాలసీ మేకర్స్ సంప్రదాయ పద్ధతుల్లో ఆలోచిస్తే మంచి ఫలితాలు రావన్నారు. చాట్ జీపీటీ, ఏఐ వంటి టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకోవాలని చెప్పారు. టెక్నాలజీ మితిమీరితే ఉద్యోగ ముప్పు ఉంటుందనే వాదన సరికాదన్నారు. ఉద్యోగ కల్పనకు టెక్నాలజీతో కొత్త మార్గాలను సృష్టించాలన్నారు. సమస్యలున్నాయని టెక్నాలజీని దూరం చేయలేమన్నారు. టెక్నాలజీని నిలువరించే ప్రయత్నం ఫలించదని చంద్రబాబు చెప్పారు.

డిజిటల్ కరెన్సీ రావాలనేది తన బలమైన కోరిక అని చంద్రబాబు స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దయితే బ్లాక్ మనీ, అవినీతికి చెక్ పెట్టినట్లేనని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆదాయాలు సైతం పెరుగుతాయని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వాలు పేదల కోసం పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టొచ్చన్నారు. రాజకీయాల్లోకి మంచిరావాలని చంద్రబాబు ఆహ్వానించారు. అలాగే అన్ని వర్గాల వాళ్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. ఓటర్లలో చైతన్యం తీసుకొస్తే దేశానికి మంచి జరుగుతందన్నారు. పూర్ టు రిచ్ అనేది తమకు ఇష్టమైన కార్యక్రమమని చంద్రబాబు పేర్కొన్నారు. పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌పిష్ రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.



Next Story

Most Viewed