విజయకుమార్‌పై వేటు.. అసలు కారణం అదేనా?

by Disha Web Desk 4 |
విజయకుమార్‌పై వేటు.. అసలు కారణం అదేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఐపీఎస్​ అధికారి, సైబరాబాద్​ ట్రాఫిక్​ డీసీపీ విజయ్​ కుమార్​పై ప్రభుత్వం వేటేసింది. రెండు రోజుల కిందటే ఆయన్ను బదిలీ చేసినా.. అధికారిక ఉత్తర్వులు మాత్రం శనివారం వెలువడ్డాదిశ, తెలంగాణ బ్యూరో: ఐపీఎస్​ అధికారి, సైబరాబాద్​ ట్రాఫిక్​ డీసీపీ విజయ్​ కుమార్​పై ప్రభుత్వం వేటేసింది. రెండు రోజుల కిందటే ఆయన్ను బదిలీ చేసినా.. అధికారిక ఉత్తర్వులు మాత్రం శనివారం వెలువడ్డాయి. అయితే, విజయ్​ కుమార్​ బదిలీ వేనుక కీలక అంశాలున్నట్లు పోలీస్​ వర్గాలు భావిస్తున్నాయి.

ఫైన్లు వేసుడెందుకు.. రాయితీ ఎందుకు..?

ఇటీవల వాహనదారుల జరిమానాలపై పోలీస్​ శాఖ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వాహనాలపై ఉన్న ఫైన్లలో భారీ రాయితీ కల్పించారు. ఈ నెల 31 వరకు ఆఫర్​ ప్రకటించారు. అయితే, అంతకు ముందే దీనిపై ట్రాఫిక్​ పోలీసులు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫైన్ల చెల్లింపుల్లో రాయితీని విజయ్​ కుమార్​ వ్యతిరేకించినట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసులను రోడ్లపై నిలబెట్టి, ఫోటోలు తీయడం, చెక్​ పాయింట్లు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేసి జరిమానాలు విధించడం ఎందుకని ఈ సందర్భంగా ప్రశ్నించారు. కరోనా పాండమిక్​ పరిస్థితుల్లో కూడా వాహనాల తనిఖీ చేశారని, దీంతో చాలా మంది పోలీసు సిబ్బంది కరోనా బారిన పడ్డారని సమావేశంలో డీసీపీ విజయ్​ కుమార్​ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇంత స్థాయిలో పని చేసి, ఫైన్లు వేసి, ఇప్పుడు వాటిలో రాయితీని ప్రకటిస్తే వాహనదారుల్లో భయం ఉండదంటూ వ్యతిరేకించారు. కానీ, ఆయన సూచనలను పరిగణలోకి తీసుకోవడమే కాకుండా.. ఉన్నతాధికారుల దగ్గర ఆయన్ను బద్నాం చేసే విధంగా నివేదించారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు ఆఫ్​ ది రికార్డు అంటూ చెప్పారు.

తనిఖీలా.. మేం చేయం

ఇదే సందర్భంలో డ్రంకెన్​ డ్రైవ్​ తనిఖీలకు ఆదేశాలిచ్చినా.. సైబరాబాద్​ పరిధిలో గత కొంతకాలంగా తనిఖీలు నిలిపివేశారు. ప్రధాన ప్రాంతాల్లో దాదాపు నాలుగైదు నెలల నుంచే ఆపేశారు. దీనిపై డీసీపీ విజయ్​ కుమార్​ స్వయంగా నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం ఉంది. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువగా వస్తే.. వాహనదారులు ఉండని ప్రాంతాల్లో పోలీసులను చెకింగ్​కు పంపించి చేతులు దులుపుకున్నారని కూడా పోలీసులు చెప్పుతున్నారు.

ట్రాఫిక్​ నిబంధనలు పాటించడం లేదని!

ఇక మాదాపూర్​ నుంచి హైటెక్​ సిటీ రోడ్డులో ఓ అపార్ట్​మెంట్​, ఆఫీస్​ కార్యాలయాల ప్రాంతంలో ట్రాఫిక్​ నిబంధనలపై డీసీపీ విజయ్​ కుమార్​ తీసుకున్న నిర్ణయం కూడా ఆయన బదిలీకి కారణమనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉండే ఓ రియల్​ వ్యాపారికి చెందిన కార్యాలయాలు, కొన్ని అపార్ట్​మెంట్లు కూడా ఉన్న ఆ ప్రాంతలో ట్రాఫిక్​ జాం ఎక్కువగా అవుతుందని, రోడ్డుపై ఉన్న బోర్డులు, కొన్ని చిన్న చిన్న నిర్మాణాలు తొలిగించడమే కాకుండా.. అక్కడ రోడ్డు వెంట ట్రాఫిక్​ జాం కాకుండా పలు చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారంలో గతంలోనే హోం మంత్రికి కూడా డీసీపీ విజయ్​ కుమార్​ తమ జోలికి రాకుండా చూసుకోవాలని సూచించినట్లు టాక్​. కొంతమంది నుంచి ఒత్తిళ్లు వచ్చినా అక్కడ ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం ఆయనకు పోస్టింగ్​ రాకుండా ఉండటంలో ఇది కూడా కారణమంటున్నారు.

కాగా, రాష్ట్రంలో శనివారం పలువురు ఐపీఎస్​ అధికారులకు టెంపరరీ పోస్టింగ్​లు ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్‌ను ఆకస్మికంగా బదిలీ చేసి, డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. సెంట్రల్ జోన్ డీసీపీగా రాజేశ్ చంద్రకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. సౌత్ జోన్ డీసీపీగా సాయి చైతన్య, ఈస్ట్ జోన్ డీసీపీగా సతీష్‌కు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది.



Next Story