BRS మనుగడ కష్టమే.. : అరవింద్ కుమార్ గౌడ్

by Disha Web Desk 4 |
BRS మనుగడ కష్టమే.. : అరవింద్ కుమార్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్‌ఎస్‌ పరిస్థితి చూస్తుంటే ఆ పార్టీ ఇక ఉంటుందా? అనే భావన ప్రజలలో ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ప్రజాసంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నందమూరి రామకృష్ణ పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ టీడీపీ చరిత్ర సృష్టించిన రోజు అన్నారు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, గుడిసెల నుంచి రాజకీయ నాయకులుగా తయారు చేసిన పార్టీ ఇదన్నారు. పటేల్‌, పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన నాయకుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు.

20 ఏళ్లుగా అధికారంలో లేకున్నా కార్యకర్తలు చెక్కు చెదరకుండా ఉన్నారంటే.. ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానం, ఆయన పార్టీ పెట్టిన ముహూర్తబలం, చంద్రబాబు నాయకత్వం, కార్యకర్తల పార్టీ ఇదన్నారు. బడుగు, బలహీనవర్గాలు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి ఏమీ కాదని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన, నాయకులు బక్కని నర్సింహులు, చిలువేరు కాశీనాథ్‌, బండి పుల్లయ్య, నందమూరి సుహాసిని, చింతమనేని ప్రభాకర్‌, నన్నూరి నర్సిరెడ్డి, టి. జ్యోత్స్న, సూర్యదేవర లత, ముంజా వెంకటరాజంగౌడ్‌, సాయిబాబా, సుజాత, లీలా పద్మావతి, సుభాషిని, మహానంది తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed