ఆర్టీసీ ప్రయాణికులకు సూపర్ గుడ్ న్యూస్.. ఇక సీట్లు పక్కా!

by Disha Web Desk 1 |
ఆర్టీసీ ప్రయాణికులకు సూపర్ గుడ్ న్యూస్.. ఇక సీట్లు పక్కా!
X

దిశ, వెబ్‌డెస్క్‌: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహలక్ష్మీ పథకం ద్వారా మహిళలందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణించేలా వెసులుబాటు కల్పించింది. ఈ క్రమంలో బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఇక పురుషుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, గతంలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో కాకుండా ఆటోలు, క్యాబులను ఆశ్రయించే వారు. అయితే, మహాలక్ష్మీ పథకం అందుబాటులోకి రాక ముందు మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రోజుకు 12 లక్షల మంది మహిళలు ప్రయాణించేవారు. అదే పథకం అమల్లోకి వచ్చి ఆ సంఖ్య కాస్త రెట్టింపైంది. దీంతో ప్రతి బస్సు మహిళలతో నిండిపోతుండటంతో పురుషులు, దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్లకు కూడా బస్సుల్లో సీటు దొరకడం లేదు.

ఈ క్రమంలో ప్రయాణికులకు శుభవార్త చెబుతూ.. టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మరో నెల రోజుల్లో 500 ఎలక్ట్రిక్‌ సిటీ బస్సులు నగరంలో తిప్పేందుకు ఆర్టీసీ అధికారులు రెడీ అవుతోంది. విడతల వారీగా మార్చి నుంచి జూన్‌, జులై నాటికి 500ల బస్సులు పూర్తిగా రోడ్లపైకి రానున్నాయి. అయితే, ఆ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండదని తెలుస్తోంది. దీంతో ఆ బస్సుల్లో పురుషులు, దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్లకు సీట్లు దొరికే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బస్సు పాస్ తీసుకున్న విద్యార్థులతో పాటు.. జనరల్‌ పాస్‌ తీసుకున్న వారు కూడా ఎలక్ట్రికల్ బస్సులో ప్రయాణించవచ్చు.



Next Story

Most Viewed