ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఈ సారి భారీగా సెలవులు

by Disha Web Desk 12 |
ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఈ సారి భారీగా సెలవులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ప్రభుత్వం వేసవి సెలవును ప్రకటించింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షలు జరిగాయి. దీంతో ప్రభుత్వం.. మార్చి 31 నుంచి మే 31 వరకు ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటిస్తూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జూన్ 1 నుంచి ఇంటర్ కాలేజీలు తిరిగి తెరుచుకోనున్నాయి. అలాగే ఇంటర్ బోర్డు ప్రకటన తర్వాత కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకోవాలని బోర్డు ఆదేశాలు జారీ చేసింది. తాజా నిర్ణయంతో ఇంటర్ విద్యార్థులకు దాదాపు రెండు నెలల పాటు వేసవి సెలవులు వచ్చాయి.


Next Story

Most Viewed