విద్యార్థులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ ప్రకటించిన ఇంటర్ బోర్డు

by Disha Web Desk 19 |
విద్యార్థులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ ప్రకటించిన ఇంటర్ బోర్డు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల ఇంట‌ర్మీడియ‌ట్ తుది పరీక్షలు పూర్తవ్వడంతో ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు విద్యార్థులకు సమ్మర్ హాలీడేస్ ఇంటర్ బోర్డు ప్రకటించింది. శనివారం 2023-24 విద్యా సంవ‌త్సరానికి ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు అక‌డ‌మిక్ క్యాలెండ‌ర్‌‌ను విడుద‌ల చేసింది. 2023-24 విద్యా సంవ‌త్సరానికి గానూ జూన్ 1 నుంచి ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ విద్యార్థుల‌కు త‌ర‌గ‌తులు ప్రారంభ‌మవుతాయ‌ని పేర్కొంది. అక్టోబ‌ర్ 19 నుంచి 25వ తేదీ వ‌ర‌కు ద‌స‌రా సెల‌వుల‌ు ఉంటాయని తెలిపింది. 26 వ తేదీన తిరిగి కాలేజీలు తెరుచుకోనున్నాయని, న‌వంబ‌ర్ 20 నుంచి 25వ తేదీ వ‌ర‌కు హాఫ్ ఇయ‌ర్ ఎగ్జామ్స్ నిర్వహించ‌నున్నట్లు వెల్లడించింది.

2024, జ‌న‌వ‌రి 13 నుంచి 16వ తేదీ వ‌ర‌కు సంక్రాంతి సెల‌వులు ఉంటాయని ప్రక‌టించింది. 17వ తేదీన ఇంట‌ర్ క‌ళాశాల‌ల త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. జ‌న‌వ‌రి 22 నుంచి 29 వ‌ర‌కు ప్రీ ఫైన‌ల్ ఎగ్జామ్స్ నిర్వహించ‌నున్నారు. ఫిబ్రవ‌రి రెండో వారంలో ప్రాక్టిక‌ల్స్, మార్చి మొద‌టి వారంలో వార్షిక ప‌రీక్షల‌ను నిర్వహించ‌నున్నట్లు ఇంట‌ర్ బోర్డు ప్రక‌టించింది. ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు బోర్డు ఆదేశాలు జారీ చేసింది.

Next Story

Most Viewed