‘ఇదిగో కవిత వాట్సాప్ చాటింగ్స్’.. జైలు నుంచి కేంద్ర హోంత్రిత్వ శాఖకు సుకేశ్ చంద్రశేఖర్ లేఖ

by Disha Web Desk 13 |
‘ఇదిగో కవిత వాట్సాప్ చాటింగ్స్’.. జైలు నుంచి కేంద్ర హోంత్రిత్వ శాఖకు సుకేశ్ చంద్రశేఖర్ లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో:దేశ రాజకీయాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కాగా ఆ వెంటనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అంతకు ముందు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ వంటి ముఖ్యమైన ఆప్ నేతలు అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ కేసు పీక్ స్టేజీలో ఉండగా మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి మండోలి జైలులో రిమాండ్ ఖైదీ గా ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ మరోసారి లేఖను విడుదల చేశారు. ఈ సారి కవితను టార్గెట్ చేస్తూ తన లాయర్ అనంత మాలిక్ ద్వారా మలో సంచలన లేఖను రిలీజ్ చేశారు. ఈ లేఖలో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కొనసాగుతున్న విచారణలో అరవింద్ కేజ్రీవాల్, కె.కవితపై మీ జోక్యం చేసుకోవాలని కేంద్ర హోం మత్రిత్వ శాఖకు సుఖేశ్ చంద్రశేఖర్ ఈ లేఖను రాశారు. ఈ సందర్భంగా కవిత, సత్యేంద్ర జైన్ అరవింద్ కేజ్రీవాల్ కు మధ్య వాట్సాప్ చాటింగ్ లు జతచేసినట్లు ఈ లేఖలో పేర్కొన్నారు. నా సిబ్బంది సూచనల మేరకు కె. కవిత నుంచి సేకరించిన కొన్ని నగదు లావాదేవీలకు సంబంధించిన స్క్రీన్ షార్టులు ఉన్నాయని తెలిపారు. కవిత వద్ద నుంచి సేకరించిన నగదు సత్యేందర్ జైన్, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మరియు గోవాకు బదిలీ చేశారని ఆరోపించారు. తాను పేర్కొన్న చాట్ లలో డబ్బును 'నెయ్యి టిన్' గా కోడ్ లాంగ్వేష్ పెట్టుకున్నామని ప్రతి టిన్ రూ.1 కోటి రూపాయలకు సమానంగా ఉందని పేర్కొన్నారు. ఈ వాట్సాప్ స్క్రీన్ షార్టులు ఈకేసులో కవిత, సత్యేంద్ర జైన్, సీఎం కేజ్రీవాల్ పూర్తి ఇన్ వాల్వ్ మెంట్ నిర్ధారిస్తాయన్నారు. కె.కవిత సూచనల మేరకు తన సిబ్బంది హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయం నుండి నగదును సేకరించారని, చెప్పబడిన వ్యక్తులకు సంబంధించి నా వద్ద ఉన్న అనేకమైన చాట్‌లలో ప్రస్తుతం పేర్కొన్న చాట్‌లు కొన్ని మాత్రమే అని ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయన్నారు. కవిత ప్రస్తుతం కస్టడీలో ఉన్నందునా ఈ సుఖేశ్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్న స్క్రీన్ షార్ట్ లు ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకునేందుుక జోక్యం చేసుకోవాలని ఈ లేఖలో రాశారు.

Next Story

Most Viewed