విద్యార్థులకు అలర్ట్..ఈ నెల 12వ తేదీలోగా రిపోర్ట్ చేయాలని ఆదేశం!

by Jakkula Mamatha |
విద్యార్థులకు అలర్ట్..ఈ నెల 12వ తేదీలోగా రిపోర్ట్ చేయాలని ఆదేశం!
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలర్ట్. 3వ విడత దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూలై 4వ తేదీన ముగిసిన విషయం తెలిసిందే. దోస్త్ ద్వారా రాష్ట్రంలోని 1,066 డిగ్రీ కళాశాలల్లో మొత్తం 4,49,449 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దోస్త్ ప్రక్రియ ద్వారా ఈ సీట్లను భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే రెండు దశలు పూర్తయ్యాయి. మూడో విడత ద్వారా మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో దోస్త్ 3వ విడతలో 73,662 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకున్నారు.

వీరిలో 9,630 మంది సీట్లు మార్చుకుని మరో కాలేజీకి వెళ్లారు. మొత్తంగా 3 విడతల్లో 1,54,246 మంది ప్రవేశాలు పొందారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని, లేదంటే సీటును కోల్పోతారని అధికారులు హెచ్చరించారు. అటు 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఇంట్రా కాలేజీ స్లైడింగ్ , 19న సీట్లు కేటాయింపు ఉంటుంది. అన్ని విడతలు పూర్తి అయితే స్పాట్ అడ్మిషన్ల కోసం ఉన్నత విద్యామండలి గైడ్ లైన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

Next Story