స్కూటీలో నుంచి వింత శబ్ధాలు.. చివరికి ఏమయ్యిందో తెలుసా..?

by Prasanna |
స్కూటీలో నుంచి వింత శబ్ధాలు.. చివరికి  ఏమయ్యిందో తెలుసా..?
X

దిశ,వెబ్ డెస్క్: సిరిసిల్ల జిల్లాలో బస్టాండ్ వద్ద నిలిపి ఉన్న స్కూటీలోకి పాము దూరింది. షబ్బీర్ అనే వ్యక్తికి చెందిన స్కూటీని షాప్ ముందు పార్క్ చేసి వెళ్లాడు. స్కూటీ తీయబోతుండగా శబ్దాలు వినిపించాయి. స్కూటీ లో పాము కనిపించింది. అప్పటికి తీయడానికి ప్రయత్నం చేశాడు. కానీ.. అది లోపలికి వెళ్లింది. అతనికి రెండు గంటల పాటు చుక్కలు చూపించింది. అతని వల్ల కాక స్నేక్ క్యాచర్ కి సమాచారం అందించారు. అతను వెంటనే స్కూటీ వద్దకు చేరుకొని మెకానిక్, క్యాచర్ గంటన్నర పాటు బండి పార్ట్స్ ఒక్కొక్కటి తొలగించి పామును కనిపెట్టారు. ఇంజిన్ దగ్గర పెద్ద సౌండ్ చేయడంతో.. ఆ పాము భయపడినట్టుంది.. సౌండ్ తో ఒక్కసారిగా ఇంజిన్‌లో దాక్కున చిన్న పాము బయటకి వచ్చింది. స్నేక్ క్యాచర్ ఒక ప్లాస్టిక్ కవర్ చేతికి చుట్టుకొని పాము పిల్లను పట్టుకున్నాడు. పట్టుకున్న పామును జన సంచారం లేని ప్రాంతంలో వదిలేశాడు.

Next Story

Most Viewed