నెలవంక కనిపించినట్లు ముస్లిం మత పెద్దల ప్రకటన

by Disha Web Desk 2 |
నెలవంక కనిపించినట్లు ముస్లిం మత పెద్దల ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా నెలవంక కనిపించినట్లు ముస్లిం మతపెద్దలు ప్రకటించారు. సోమవారం నెలవంక దర్శనంతో మాసం ప్రారంభమైందని అధికారికంగా వెల్లడించారు. అంతేకాదు.. రేపటి(మంగళవారం) నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభించాలని తెలిపారు. అయితే, ముస్లింలు జరుపుకునే పండుగల్లో రంజాన్ అతి ముఖ్యమైనది. రంజాన్‌ను ‘రమదాన్’ అని పిలుస్తారు. అలాగే ‘ఈద్ ఉల్ ఫిత్ర’ అని కూడా అంటారు.

ఈ రంజాన్ నెలలో ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఉంటారు. దానధర్మాలు చేస్తారు. ఇది క్రమశిక్షణను, దాతృత్వాన్ని, ధార్మిక చింతనను ప్రజలకు బోధిస్తుంది. ముస్లింల మత గ్రంథమైన ఖురాన్ ఈ మాసంలోనే ఆవిర్భవించిందని చెప్పుకుంటారు. అందుకే ఈ మాసం ముస్లింలకు అత్యంత పవిత్ర మాసం. కాగా, ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం ఆదర్శవంతమైన జీవనానికి ప్రేరణ ఇస్తోందన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ మాసాన్ని ఆనందంతో.. సుఖసంతోషాలతో నిర్వహించుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

Next Story

Most Viewed