నాలుగేళ్ల కనిష్టానికి ఎస్సారెస్పీ.. ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆందోళన

by Disha Web Desk 4 |
నాలుగేళ్ల కనిష్టానికి ఎస్సారెస్పీ.. ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆందోళన
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఉత్తర తెలంగాణ వరప్రధాయిని శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం నాలుగేళ్ల కనిష్టానికి చేరుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అయితే ఏప్రిల్ మాసంలో సాధారణంగా 20 టీఎంసీలకు పైగా నీటి మట్టం ఉంటుండగా ఈ ఏడాది మాత్రం 1.686 టీఎంసీలకు పడిపోయింది. కాగా, ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో ఖాళీ గ్రౌండ్‌ను తలిపిస్తోంది. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 90.313 కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న 10.686 టీఎంసీల్లో నుంచి 3 టీఎంసీలు ఉమ్మడి నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల తాగునీటి అవసరాల కోసం వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న నీటిలో 2.5 నుంచి 3 టీఎంసీల నీరు ఆవిరయ్యే చాన్స్ ఉందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఇక వర్షాకాలంలో సమృద్ధిగా కురిస్తేనే ప్రాజెక్టుకు పునర్వైభవం రానుంది.



Next Story

Most Viewed