జీవో 4ను పకడ్బందీగా అమలు చేయాలి.. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్

by Dishafeatures2 |
జీవో 4ను పకడ్బందీగా అమలు చేయాలి.. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మెరుగైన క్రీడా ఫలితాల సాధనకు జీవో 4ను పకడ్బందీగా అమలు చేయాల్సిందేనని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రీడా సంఘాలన్నీ వెంటనే సంబంధిత డాక్యుమెంట్లు స్పోర్ట్స్ అథారిటీకి సమర్పించాలని ఆదేశించారు. ఎల్బీ స్టేడియంలోని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఛాంబర్ లో సోమవారం జరిగిన రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని క్రీడాకారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అందించే వివిధ పథకాలు నిజమైన క్రీడాకారులకు అందాలంటే క్రీడా సంఘాల్లో పారదర్శకత అవసరమన్నారు.

భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ప్రభుత్వ ఫలాలు నిజమైన క్రీడాకారులకు దక్కాలంటే ప్రభుత్వ నిబంధనల మేరకు క్రీడా సంఘాలు పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్,ప్రేమ్ రాజ్ స్పోర్ట్స్ పార్టీ డిప్యూటీ డైరెక్టర్ చంద్రారెడ్డి తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఉమేష్ కుమార్ క్రీడా సంఘాల ప్రతినిధులు మల్లారెడ్డి ,శోభన్ బాబు,బాలరాజు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed