తెలంగాణకూ స్పెషల్ ‘పాంచ్ న్యాయ్’.. స్టేట్‌కు ఉపయోగపడే ఐదు అంశాలు ఎంపిక..!

by Disha Web Desk 19 |
తెలంగాణకూ స్పెషల్ ‘పాంచ్ న్యాయ్’.. స్టేట్‌కు ఉపయోగపడే ఐదు అంశాలు ఎంపిక..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి మేనిఫెస్టోలోనూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన అంశాలను ప్రత్యేకంగా పొందుపరచనున్నారు. ఏఐసీసీ మేనిఫెస్టోకు అనుబంధంగా రాష్ట్రానికి చెందిన ఐదు అంశాలను ప్రకటించనున్నారు. విభజన హామీలకు అదనంగా అంశాలను క్రోడీకరించనున్నారు. ఈ మేరకు గాంధీభవన్‌లో మంగళవారం మేనిఫెస్టో కమిటీ మీటింగ్‌ను నిర్వహించారు. చైర్మన్ శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్‌లో మేనిఫెస్టో కమిటీ సభ్యులు డాక్టర్ రియాజ్, ప్రోఫెసర్ జానయ్య, శ్యాంమొహన్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు మూడు గంటల పాటు మేనిఫెస్టో కమిటీ మీటింగ్ జరిగింది. ఇందులో తెలంగాణకు ఉపయోగపడే అంశాలపై చర్చించారు.

వీటిలో ప్రధానంగా రాష్ట్రంలో ఎయిర్ పోర్టులను విస్తరించడం, హైదరాబాద్ నుంచి అన్ని పట్టణాలకు ట్రైన్ ల సంఖ్య పెంచడం, భద్రాచలానికి స్పెషల్ ట్రైన్లు, సైనిక్ స్కూళ్లు ఏర్పాటు, మైనింగ్ యూనివర్సిటీ, జిల్లాల్లోనూ పారిశ్రామిక కారిడార్లు, మూసీ నదీ ప్రక్షాళనను కేంద్రం నుంచి స్పెషల్ ఫండ్, వంటి అంశాలపై కమిటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. వీటిలో ప్రధానమైన ఐదు అంశాలను ఎంపిక చేసి, ఈనెల 4న టీపీసీసీకి ఈ కమిటీ నివేదిక ఇవ్వనున్నది. ఆ తర్వాత ఈ నెల 6న తుక్కుగూడలో ఏఐసీసీ మేనిఫెస్టో రిలీజ్ అనంతరం అక్కడే రాష్ట్రానికి చెందిన పాంచ్ న్యాయ్‌లను కూడా ప్రకటించనున్నట్లు సమాచారం.


Next Story

Most Viewed