కొన్ని సార్లు ఓడినా మంచే జరుగుతుంది.. అలాగే జీవన్ రెడ్డికి కూడా!.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by Disha Web Desk 5 |
కొన్ని సార్లు ఓడినా మంచే జరుగుతుంది.. అలాగే జీవన్ రెడ్డికి కూడా!.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కొన్ని సార్లు ఓడినా మంచే జరుగుతుందని, అలాగే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయిన జీవన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం తాజ్ డెక్కన్ లో గల్ఫ్ కార్మిక సంఘాలతో సమావేశం అయిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గల్ఫ్ సమస్యల పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే కాక కేంద్ర ప్రభుత్వం పరిధిలో కూడా కొన్ని ఉంటాయని అన్నారు. ఈ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో మాట్లాడేందుకు తాను ఉన్నానని, కేంద్ర ప్రభుత్వం తరపున మాట్లడేందుకు జీవన్ రెడ్డి గారిని పార్లమెంట్ కు పంపించాలని సూచించారు.గల్ఫ్ సమస్యలపై పార్లమెంట్ లో నిలబడి కొట్లాడేందుకు మీ తరుపున ఒక మనిషి ఉండాలని, అవకాశం వస్తే కేంద్రమంత్రిగా కూడా సొంతంగా సంతకాలు పెట్టుకునే అవకాశం కూడా ఉందని అన్నారు.

అలాగే కొన్ని సార్లు ఓటమి కూడా మనకు ఉపయోగపడుతుందని, దానికి ఉదహారణ నేనే అని అన్నారు. 2018 ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల 2019లో ఎంపీగా గెలిచానని, జీవన్ రెడ్డి కూడా అప్పుడు ఓడిపోయి తర్వాత ఎమ్మెల్సీ అయ్యాడని గర్తుచేశారు.అనంతరం నేను పీసీసీ అయ్యి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా మీ ముందు ఉన్నానని, అలాగే అదృష్టం కలిసి వచ్చి జీవనన్న కూడా కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉందని తాను బలంగా భావిస్తున్నానని తెలిపాడు. పార్లమెంట్ లో మాట్లాడలన్నా.. వారు అక్కడికి వెళ్లి ఇంకో పెద్ద పదవిలో ఉండాలన్న పార్టీలకు అతీతంగా జీవన్ రెడ్డిని గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు.


Next Story

Most Viewed