ఉపాధి పనులు చేస్తుండగా దొరికిన వెండి నాణాలు.. ఎక్కడంటే?

by Disha Web Desk 4 |
ఉపాధి పనులు చేస్తుండగా దొరికిన  వెండి నాణాలు.. ఎక్కడంటే?
X

దిశ, మానకొండూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం ఉపాధి హామీ పనిచేస్తుండగా కూలీలకు మట్టి‌తో చేసిన గురిగిలో వెండి నాణాలు లభ్యమయ్యాయి. గుట్టుచప్పుడు కాకుండా గురిగిని పగలగొట్టి నానాలను కూలీలు పంచుకున్నట్లు తెలిసింది. అయితే ఆ నోట.. ఈ నోట వ్యాపించడంతో అధికారులు రంగంలోకి దిగారు. గురిగిలో మొత్తం సుమారు (27)వెండి నాణేలు దొరికినట్టు గ్రామస్తులు తెలిపారు.

ఆలస్యంగా అధికారులకు విషయం తెలియడంతో శనివారం ఘటనా స్థలానికి వచ్చిన తహసీల్దార్ విచారణ చేసి కూలీల వద్ద నుండి 27 నాణేలు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన వెండి నాణేలు మహబూబ్ అలీ నవాబ్ ఖాన్ కాలంలో (1869,1911)మధ్య చలామణిలో ఉన్నట్లు పురావస్తు శాఖ గుర్తించినట్లు తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed