శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా సింకారు శివాజీ

by Disha Web Desk 19 |
శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా సింకారు శివాజీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్దవ్ ఠాక్రే శివసేన యువజన విభాగం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సింకారు శివాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే వర్గంలో చేరి, శివ సేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే తన అధికార నివాసంలో శివాజీకి నియామకపత్రం అందజేశారు. ఉన్నట్టుండి శివ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతను భర్తీ చెయ్యడం, అది కూడా కింది స్థాయి నుంచి వచ్చిన యువ నాయకుడికీ పట్టం కట్టడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలల్లో ఉత్కంఠ నెలకొంది. సింకారు శివాజీ గతంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌గా పని చేశారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి.

నిరుద్యోగ సమస్యల పైన పోరాటం చెయ్యడం, రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే వరుస మహారాష్ట్ర పర్యాటనలు చేస్తున్న తరుణంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతను స్వయంగా తన బంగ్లా (వర్ష సీఎం నివాసంలో) ఆయననే పిలిచి అందించి రాష్ట్ర రాజకీయాల పైన పూర్తి వివరాలను అడిగి తీసుకున్నట్లు తెలుస్తుంది. సింకారు శివాజీ శివసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం ఏవిధంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. ఈ కార్యక్రమంలో శివ సేన జాతీయ కార్యదర్శులు సుశాంత్ షేలర్, మాజీ ఎమ్మెల్యే అభిజిత్, శివసేన నేతలు సాయి కిరణ్, పసుపులేటి గోపి కిషన్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed