పండుగపూట ఘోరం.. జగిత్యాలలో బీభత్సం సృష్టించిన వీధి కుక్కలు

by GSrikanth |
పండుగపూట ఘోరం.. జగిత్యాలలో బీభత్సం సృష్టించిన వీధి కుక్కలు
X

దిశ, కోరుట్ల: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్ పూర్ గ్రామంలో గొర్ల మందపై కుక్కలు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో 16 గొర్రెలు మృతి చెందగా మరో 7 గొర్రెల పరిస్థితి విషమంగా ఉందని గొర్రెల యజమాని కేశవేణి చొక్కయ్య తెలిపారు. బాధితుడి వివరాల ప్రకారం.. రోజువారీ లాగే గొర్లను మేతకు తీసుకుపోయి సోమవారం సాయంత్రం సమయంలో గొర్రెల షెడ్డులో వదిలి వెళ్లారు.


అనంతరం ఆయన ఇంటికెళ్లాడు. రాత్రి సమయంలో గొర్రెల పాకలోకి కుక్కలు చొరబడి గొర్రెలపై దాడి చేసినట్లు గమనించిన స్థానికులు చొక్కయ్యకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే చొక్కయ్య అక్కడకు రాగా.. 16 గొర్రెలు చనిపోయి, 25 గొర్రెలు గాయపడి ఉన్నాయి. కాగా, తాను గొర్రెలను రెండు నెలల కిందటే కొనుగోలు చేసినట్లు వాపోయాడు. మృతి చెందిన గొర్రెల విలువ సుమారు రూ.3 లక్షల వరకు ఉంటుందని తమను ప్రభుత్వం అదుకోవాలని వేడుకున్నాడు. ఈ సంఘటన పండుగపుట గ్రామంలో విషాదం నింపింది.Next Story

Most Viewed