TS: శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మకు కీలక పదవి

by Disha Web Desk 2 |
TS: శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మకు కీలక పదవి
X

దిశ, డైనమిక్ బ్యూరో: మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంత చారి తల్లి, బీఆర్ఎస్ నాయకురాలు శంకరమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మంగళవారం సెక్రటేరియట్‌లో సీఎంతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. గత కేసీఆర్ ప్రభుత్వం శంకరమ్మకు పదవి ఇస్తామని ఊరించి విస్మరించిందనే విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో అనూహ్యంగా శంకరమ్మ సీఎంతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వంతో శంకరమ్మ భేటీ కావడం ఇంట్రెస్టింగ్ మారింది.

శంకరమ్మకు కీలక పదవి:

శంకరమ్మకు కీలక పదవి ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలో ఎమ్మెల్సీ పోస్టులతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీకి రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులను ఆదుకుంటామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఉద్యమకారులకు ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజాపాలన కార్యక్రమంలో ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తుండగా అనూహ్యంగా శంకరమ్మకు కీలక పదవి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి రావడం ఆసక్తిగా మారింది.

గత ప్రభుత్వం శంకరమ్మకు అనేక సందర్భాల్లో పదవి ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చినా కేసఆర్ మాత్రం ఆమెకు ఎటువంటి పదవి ఇవ్వలేదు. ఇటీవల ట్యాంక్ బండ్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అమరవీరుల స్మృతి వనం ప్రారంభోత్సవం సంతర్భంగా ఆమెకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆహ్వానించడంతో ఆమెకు గులాబీ బాస్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నారనే చర్చ జరిగింది. కేసీఆర్ మాత్రం ఆమెకు మొండిచేయి చూపించారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఇవాళ సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story

Most Viewed