విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలు.. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ

by Dishafeatures2 |
విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలు.. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థుల ప్రాణాలను తీస్తున్న శ్రీచైతన్య యాజమాన్యం పై హత్య కేసు నమోదు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి ఆర్ఎల్ మూర్తి, టీ. నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. కార్పొరేట్ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న నిమ్మల రమాదేవి ఆత్మ హత్యకు కారకులైన శ్రీచైతన్య యాజమాన్యం పై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

మార్కులు, ర్యాంకుల కోసం శ్రీచైతన్య కళాశాల విద్యార్ధులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని, వారి కళాశాలలకు లాభాలు తప్ప విద్యార్థుల సంక్షేమం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ విద్యా సంస్థల్లో ఇది మొదటి ఆత్మహత్య కాదని ఇప్పటికే అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇవన్నీ ఆత్మహత్యలు కాదని శ్రీ చైతన్య చేస్తున్న హత్యలు అని ఎస్ఎఫ్ఐ భావిస్తోందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి శ్రీచైతన్య యాజమాన్యం పై హత్య, క్రిమినల్ కేసులు బుక్ చేయాలని కోరారు.

విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని, విద్యార్థి కుటుంబానికి అండగా నిలబడి న్యాయం కోసం ఆందోళన చేస్తున్న ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండించారు. తక్షణమే అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అండగా ఉన్న విద్యార్ధి నాయకులను కాకుండా పోలీసులు ఈ ఘటనకు కారకులైన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని, ఘటనపై సమగ్రమైన విచారణ జరిపించాలన్నారు. ఈ ఘటన నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది.

Next Story

Most Viewed