మహిళా కానిస్టేబుల్‌పై లైంగిక దాడి.. SIపై కేసు నమోదు

by Rajesh |
మహిళా కానిస్టేబుల్‌పై లైంగిక దాడి.. SIపై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎస్ఐ మహిళా కానిస్టేబుల్‌పై లైంగిక దాడికి పాల్పడటం రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనలో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పీఎస్ ఎస్ఐ భవానీసేన్‌పై కేసు నమోదైంది. ఎస్ఐ భవానీ సేన్ వేధిస్తున్నట్లు మహిళా కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విధుల్లో ఉన్న తనపై హత్యాచారం చేసినట్లు ఆరోపించారు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని ఎస్ఐ బెదిరించినట్లు మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఎస్పీని కలిసి సదరు మహిళా కానిస్టేబుల్ తన గోడు వెళ్లబోసుకుంది. దీంతో ఎస్ఐ భవానీసేన్‌ను ఉన్నతాధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాళేశ్వరం పీఎస్‌లో అర్ధరాత్రి ఇద్దరు డీఎస్పీలు, సీఐలతో విచారణ చేపట్టారు. గతంలో మరో యువతితో అసభ్యంగా ప్రవర్తించిందుకు ఎస్ఐ సస్పెండ్ అయినట్లు తెలిసింది. మహిళా కానిస్టేబుల్‌పై లైంగిక దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.Next Story

Most Viewed