- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
‘తెలంగాణకు సాక్షి ‘మీరాకుమారి’.. ఆమెతోనే నిజాలు చెప్పిస్తాం’

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సాక్షి లోక్ సభ మాజీ స్పీకర్మీరాకుమారి అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్గౌడ్పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వరాష్ట్రం కోసం ఉద్యమం, పార్లమెంట్ లో బిల్లు సందర్భంగా జరిగిన చర్చల్లో వాస్తవాలన్నింటినీ మీరా కుమారితోనే చెప్పిస్తామని మహేష్‌గౌడ్ స్పష్టంచేశారు. సోనియా గాంధీ చేసిన కృషిని కూడా మీరా కుమారి వివరిస్తారన్నారు. ఇక కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు జరుగుతాయని, సక్సెస్చేయాలని ఆయన కార్యకర్తలు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.శుక్రవారం ఉదయం 10.30 గంటలకు గాంధీ భవన్ లో జాతీయ పతాకం ఆవిష్కరణ ఉంటుందన్నారు.11.00 గంటలకు గన్ పార్క్ వద్ద అమరవీరులకు లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నివాళులు అర్పిస్తారన్నారు. అనంతరం నిజాం కాలేజ్ వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుందని, గన్ ఫౌండ్రి, అబిడ్స్ నెహ్రు విగ్రహం, మొహంజాహి మార్కెట్ మీదుగా గాంధీభవన్ కు చేరుకుంటుందన్నారు. తర్వాత ఆవిర్భావ దినోత్సవ సభ ఉంటుందని మహేష్‌గౌడ్ స్పష్టం చేశారు. ఏఐసీసీ ఇంచార్జ్ శ్రీ మానిక్ రావ్ ఠాక్రే, ఇతరముఖ్య నాయకులు పాల్గొంటారన్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ముఖ్యులకు సన్మానం చేస్తామన్నారు.