పొత్తు అంటే చెప్పుతో కొట్టాలని నేనే చెప్పా: బండి సంజయ్

by Disha Web Desk 2 |
పొత్తు అంటే చెప్పుతో కొట్టాలని నేనే చెప్పా: బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేశాయని గుర్తుచేశారు. ఈ రెండు పార్టీలు కలిసి దళిత మహిళ అయిన ద్రౌపది ముర్మును ఓడించాలని చూశారని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ నేతలు ఎవరైనా పొత్తుకు వస్తే చెప్పుతో కొట్టాలని నేనే చెప్పానని సీరియస్ అయ్యారు.

ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ పనిఅయిపోయిందని అన్నారు. ఈ క్రమంగా ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని చెప్పారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితం కాబోతోందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని వెల్లడించారు. బీఆర్ఎస్‌కు ఓటు వేయడమంటే చెత్త బుట్టలో వేయడమే అని అన్నారు. అలా ఈ సారి ఎవరూ ఓటు వేస్ట్ చేసుకోరు అని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. మరో వారం రోజుల్లో తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థులను బీజేపీ ప్రకటించనుందని చెప్పారు.


Next Story

Most Viewed