ఆన్‌లైన్‌లో పార్టీ కండువాల అమ్మకం

by Disha Web Desk |
ఆన్‌లైన్‌లో పార్టీ కండువాల అమ్మకం
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రస్తుతం మనం అంతా ఆన్‌లైన్ షాపింగ్ యుగంలో ఉన్నాం. గుండు సూది నుండి మొదలుకుని భారీ వాహనాల వరకు అంతా ఫోన్‌లో(ఆన్ లైన్) షాపింగ్ చేసుకునే టెక్నాలజీ యుగంలో ఉన్నాం. గతంలో షాపులు, మాల్స్‌కు వెళ్లి అవసరమైన వస్తువులు దొరక్క బిల్లింగ్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు షాపింగ్ అంటే చాలు... ఆన్‌లైన్‌లో లక్షల సైట్లు పుట్టుకొచ్చాయి. ఇంటికి, వంటగదికి, ఆఫీస్‌కి ఏం కొనాలన్నా జనాలు ఆన్‌లైన్ షాపింగ్ సైట్ల వైపు చూస్తున్నారు. ఇంట్లో కూర్చొని ఫోన్‌లో ఒక్కనొక్కు నొక్కితే చాలు కావాల్సినవన్నీ కళ్లముందు వాలిపోతుంటాయి. అలాంటి ఆన్‌లైన్ జమానాల సబ్బులు, సర్పులతో పాటు రాజకీయ పార్టీల జెండాలు, కండువాలు, టోపీలు కూడా అమ్ముతున్నారు.

ఈ కామర్స్ సైట్లలో వీటి ఫొటోలు కనిపించేసరికి అందరు షాక్ కు గురయ్యారు. దీంతో, మనిషి నిత్యవసరాలతో పాటు రాజకీయాలు కూడా ఆన్‌లైన్ యుగం వెంట నడుస్తుందని అర్థమవుతుంది. ఇది వరకు షాపుల్లో ఇచ్చిన ఆర్డర్ల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. పార్టీ మీటింగ్, ర్యాలీల సమయంలో జెండాలు సమయానికి అందక పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడేవాళ్లు. అలాంటిది ఆన్‌లైన్ మార్కెట్‌లో ఇవి దొరుకుతుండటంతో కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా రాజకీయ పార్టీలు కార్యకర్తలకు ఉచితంగా జెండాలు, కండువాలు పంపిణీ చేస్తాయి. అయితే, ఫ్రీగా పంచే జెండాలు, కండువాలను ఆన్‌లైన్‌లో డబ్బులు పెట్టి ఎవరు కొంటారు అన్నది ప్రశ్నగా మారింది. అమ్మకాలు మాత్రం బాగానే సాగుతున్నాయి.. ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్‌లో బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీల జెండాలు, కండువాలు, టోపీలు ఇలా రకరకాల వస్తువులను విక్రయిస్తున్నారు. మరి మీరెందుకు ఆలస్యం.. మీ పార్టీ జెండాలు కావాలంటే శ్రమించకుండా.. ఒక్క నొక్కునొక్కి ఆన్‌లైన్లో కొనుక్కోండి.

Next Story