రుణమాఫీపై రేవంత్ ప్రకటన.. KTR రియాక్షన్ ఇదే..!

by Disha Web Desk 4 |
రుణమాఫీపై రేవంత్ ప్రకటన.. KTR రియాక్షన్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. మంగళవారం ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ నాయకులు విస్మరించారన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంకా అమలు చేయలేదన్నారు. ఇప్పుడు పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారన్నారు. రైతు బంధు గురించి అడిగితే తమపై విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రైతులు అడగకుండానే తమ ప్రభుత్వం రైతులకు రైతు బంధు ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి కరువు తెచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంట్ సరిగా ఉండటం లేదని.. మంచి నీళ్లకు గోస అవుతోందన్నారు. మిషన్ భగీరథతో గూడాలు, తండాలకు నీళ్లు అందించామన్నారు.


Next Story