ఆ రెండు లోక్ సభ స్థానాలపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్.. నామినేషన్ రోజు అక్కడ బహిరంగ సభ

by Disha Web Desk 13 |
ఆ రెండు లోక్ సభ స్థానాలపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్.. నామినేషన్ రోజు అక్కడ బహిరంగ సభ
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీ కాంగ్రెస్‌కు తెలంగాణలో రాబోయే లోక్‌సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ క్రమంలో సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నల్లగొండ, భువనగిరిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ రెండు స్థానాలు తమ ఖాతాలో పడాల్సిందే అనే పట్టుదలతో ఉన్న ఆయన ఇవాళ జూబ్లీహిల్స్‌లోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు.

సమన్వయంతో సాగాలి..

మీటింగ్‌కు భువనగిరి, నల్లగొండ అభ్యర్థులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు సీఎం దిశా నిర్దేశం చేశారు. సిట్టింగ్ స్థానాలను నిలుపుకునేందుకు ప్రతి ఒక్కరు గ్రౌండ్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. టికెట్ ఆశించి అసంతృప్తితో ఉన్న నేతలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. అయితే భువనగిరి టికెట్ కోసం కోమటిరెడ్డి ఫ్యామిలీ చివరి క్షణం వరకు ప్రయత్నించగా చివరకు రేవంత్ రెడ్డి వర్గీయుడిగా పేరున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఫైనల్ అయింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లడం చర్చనీయాంశం అయింది.

రెండూ గెలవాల్సిందే..

నల్లగొండలో కాంగ్రెస్ గెలుపు ఖాయం అనే ధీమాతో ఉండగా భువనగిరిలో మాత్రం బూర నర్సయ్య గౌడ్ లాంటి బలమైన ప్రత్యర్థి ఉన్న నేపథ్యంలో గట్టి పోటీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గట్టిగా తలుచుకుంటే కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమనే అంచనాకు వచ్చిన ముఖ్యమంత్రి స్వయంగా తానే రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి భువనగిరిలో గెలుపుపై కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ రెండు సెగ్మెంట్లు ఇటు రేవంత్ రెడ్డికి, అటు కోమటిరెడ్డి బ్రదర్స్‌కు చాలెంజ్‌గా మారాయి.

నామినేషన్లకు సీఎం హాజరు..

అన్ని సెగ్మెంట్లలో నామినేషన్ వేసిన రోజు సీఎం రేవంత్ హాజరయ్యేలా, అదే నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా 21న భువనగిరిలో నామినేషన్‌ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. అదే రోజు అక్కడ భారీ బహిరగసభ నిర్వహించనున్నారు.


Next Story

Most Viewed