రేవంత్ రెడ్డి సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటున్నాడు!.. బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్

by Disha Web Desk 5 |
రేవంత్ రెడ్డి సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటున్నాడు!.. బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏప్రిల్ 1న గ్రూప్-2 నోటిఫికేషన్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి అందరినీ ఫూల్స్ చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఏప్రిల్ 1న గ్రూప్-2 నోటిఫికేషన్ ఇస్తామని మీరే చెప్పారని, ఏప్రిల్ 1 ఫూల్స్ డే అని అందరికీ తెలుసని, రేవంత్ రెడ్డి అందరినీ ఫూల్స్ చేశాడని అన్నారు. ఒక్క గ్రూప్-2 నోటిఫికేషనే కాదు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని కానీ, రాహుల్ గాంధీ తాము అధికారంలోకి వచ్చాక 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ గమర్నమెంట్ లోనే జాబు నోటిఫికేషన్లు ఇచ్చారని, పరీక్షలు కూడా కేసీఆర్ గవర్నమెంట్ లోనే పెట్టారని, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అప్పుడే అయిపోయిందని అన్నారు. ఇంతలో ఎన్నికల కోడ్ వచ్చి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాన్ని ఆసరాగా చేసుకొని, తాము 30 వేల జాబులు ఇచ్చామని సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Next Story

Most Viewed